Pages

Friday, 26 August 2016

సూపర్ స్టార్ కు స్టార్ డైరెక్టర్ కితాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన ప్రిన్స్, ఈ సారి అభిమానులను భారీ హిట్ తో అలరించాలని భావిస్తున్నాడు. అందుకే మురుగదాస్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, షూటింగ్ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ మహేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అందగాడిగా, నటుడిగా సూపర్ స్టార్ కు తిరుగులేదన్నది అందరికీ తెలిసిన విషయమే, అయితే అలాంటి సూపర్ స్టార్ సెట్ లో ఎలా ఉంటాడు అన్న విషయాన్ని బయటపెట్టాడు, డైరెక్టర్ మురుగదాస్. మహేష్ చాలా స్టైలిష్, మ్యాన్లీ అంటూ పొగిడేసిన మురుగదాస్, సెట్ లో ప్రిన్స్ దర్శకుడు చెప్పే విషయాలను ఆసక్తిగా వింటారని, ఎంతో డేడికేషన్ తో వర్క్ చేస్తారని తెలిపాడు. ఈ మధ్యే రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలైన ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

No comments:

Post a Comment